డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కీ రోల్ లో నటిస్తోంది. ఇందుకు సంబంధించి పోస్టర్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలని కసితో పని చేస్తున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం బిజీగా మారి పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం షేర్ చేసిన ఫోటో హల్ చల్ చేస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ నీలి రంగు చీరను ధరించింది. ఆకు పచ్చ జాకెట్ వేసుకుంది. కళ్లల్లో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డారు దర్శకుడు .
గతంలో కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సమయంలో ఆచార్య తీశాడు కొరటాల శివ. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ , పూజా హెగ్డే, కాజల్ నటించినా వర్కవుట్ కాలేదు.
అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు దర్శకుడు. తనపై అపారమైన నమ్మకం ఉంచాడు తారక్. సినిమా దొబ్బినా తనకు మరో ఛాన్స్ ఇచ్చాడు. దీంతో తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డాడు శివ