James Cameron: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుతున్నాయి. స్టోరీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పిన మాటల ప్రకారం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే అడ్వంచరెస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమాలో యాక్షన్ స్వీక్వెన్స్, ఫిట్ నెస్ మరియు కొత్త లుక్ కోసం మహేశ్ బాబు ఇప్పటికే జర్మనీ వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు.
James Cameron Will Come to Mahesh Babu Movie Opening
ఈ సినిమా షూటింగ్ కు డేట్ ఫిక్స్ కాలేదు, మహేశ్ మినహా మిగిలిన తారాగాణం ఎవరనేది తేలలేదు, సినిమా పేరు కూడా ఖరారు కాలేదు… అయినప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికి కారణం ఒకటి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కావడం… రెండోది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న తరువాత ప్రారంభం కాబోయే సినిమా కావడం. దీనితో ఆ స్థాయిలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించడానికి దర్శక ధీరుడు రాజమౌళి ప్రయత్నం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కడంతో… ఆ వేదికపై హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, టైటానిక్, అవతార్ సినిమాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్(James Cameron)… రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కొనియాడారు. అంతేకాదు రాజమౌళిలోని మేకర్ అంటే నేను అభిమానినైపోయాను అని జేమ్స్ కామెరూన్ అన్నట్లు వారి సంభాషణలో తేటతెల్లం అయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తాను తెరకెక్కించేబోయే సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి రాజమౌళి… పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సాక్ష్యాత్తూ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాజమౌళి అండ్ కో నుండి దీనిపై అధికారిక సమచారం లేనప్పటికీ… మరి కొద్ది రోజుల్లో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
సినిమా మేకింగ్ లోనే కాదు ప్రచారంలో కూడా తనదైన ప్రతిభను చూపించే రాజమౌళి… సినిమాకు హైప్ తేవడానికి జేమ్స్ కామెరూన్(James Cameron) ను తీసుకురావడంలో అభిమానులకు ఏమాత్రం అనుమానాలు లేవు. దీనితో ఇండియన్ జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ ను… హాలీవుడ్ జేమ్స్ కామెరూన్ అంగీకరించడం ఖాయం… మహేశ్ బాబు సినిమాకు క్లాప్ కొట్టడం ఖాయం అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మొదటిసారి వస్తున్న ఈ సినిమాను సుమారు వెయ్యి కోట్లతో తెరెక్కిస్తున్నట్లు… భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి జేమ్స్ కామెరూన్ అయితే ఆ సినిమాకు కావాల్సిన బజ్ వస్తుందని… చిత్ర యూనిట్ అంచనా. ఈ నేపథ్యంలో రాజమౌళి… ఆస్కార్ వేదికగా జేమ్స్ కామెరూన్(James Cameron) తో ఏర్పడిన పరిచయాన్ని ఉపయోగించుకుని… మహేశ్ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఉగాదికి ఈ సినిమాను ప్రారంభించాలనుకున్నప్పటికీ… మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Sajid Nadiadwala: హిందీ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతో రజనీ సినిమా !