Manchu Manoj : జల్ పల్లి ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో విచారణకు హాజరయ్యారు సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్(Manchu Manoj). తన ఆస్తులను కాజేసేందుకు కొడుకు ప్లాన్ చేశాడని, తనకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు మోహన్ బాబు. దీంతో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్. భూములు, ఆస్తులకు సంబంధించిన వివాదం కావడంతో ఇది పూర్తిగా జాయింట్ కలెక్టర్ పరిధిలోనే ఉంటుంది.
Mohan Babu-Manchu Manoj Issue
తండ్రీ కొడుకులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న మోహన్ బాబు, మనోజ్ భారీ బందోబస్తు మధ్య విచారణకు వచ్చారు. ఇరువురిని పిలిపించిన సంయుక్త కలెక్టర్ 2 గంటలకు పైగా విచారణ చేపట్టారు. ఇరువురు అర్థం చేసుకుని కాంప్రమైజ్ కావాలని సూచించారు. సమాజంలో కొంత పేరున్న వారు ఇలా చేస్తా అని కూడా పేర్కొన్నట్లు సమాచారం.
విచారణ సమయంలో తండ్రీ కొడుకులు పెద్ద ఎత్తున వాగ్వావాదానికి దిగారు. మరోసారి ఎంక్వయిరీగా రావాల్సిందిగా ఆదేశించారు అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్. బయటకు వచ్చిన ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్క బడింది. మోహన్ బాబు, మనోజ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయారు.
Also Read : Stunning Actor Sonu Sood :ఏపీకి సోనూ సూద్ అంబులెన్స్ లు విరాళం