సన్ పిక్చర్స్ సంచలన ప్రకటన చేసింది. మంగళవారం కీలక అప్ డేట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియా, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ , యోగితో తీసిన జైలర్ రికార్డ్ బ్రేక్ చేసింది. రూ. 650 కోట్లు సాధించింది.
దీంతో ఏకంగా సన్ పిక్చర్స్ యజమాని, డీఎంకే ఎంపీ కళానిధి మారన్ ఏకంగా రజనీకాంత్ కు రూ. 100 కోట్ల చెక్కు ఇచ్చాడు. అంతే కాదు మూడున్నర కోట్ల విలువ చేసే విలువైన కారును బహుమానంగా ఇచ్చాడు.
అంతే కాదు మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అనిరుధ్ రవిచందర్ కు రూ.30 కోట్లు ఇచ్చాడు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ కు బ్లాంక్ చెక్కుతో పాటు కారు కూడా ఇచ్చాడు. ఎన్ని కోట్లు అయినా తీసుకోవచ్చంటూ స్పష్టం చేశాడు మారన్.
ఇదిలా ఉండగా తాజాగా జైలర్ కు సంబంధించి భారీ సక్సెస్ సాధించడంతో జైలర్ కు సీక్వెల్ గా సినిమా తీస్తున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ గా డైరెక్టర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ కు ఏకంగా రూ. 55 కోట్లు చెక్కు ఇచ్చాడు. ఇది తమిళ సినీ పరిశ్రమను షాక్ కు గురి చేసింది.