Jailer Villain: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్ వర్మగా చేసిన వినాయకన్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో అందరినీ అలరించి సినిమా విజయానికి తను కూడా ఓ కారణమయ్యారు. స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్(Vinayakan).. రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. కానీ, రియల్ లైఫ్ లో కూడా వినాయకన్… వర్మ పాత్రలానే బిహేవ్ చేయడంతో విమర్శలపాలవక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ‘జైలర్’ సినిమా విలన్ వినాయకన్‌ను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. ఇక వినాయకన్ అరెస్ట్ విషయానికి వస్తే..
Jailer Villain Vinayakan..
మద్యం మత్తులో ఉన్న వినాయకన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో… వినాయకన్ ను అదుపులోకి తీసుకొని ఆర్.జి.ఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అప్పగించినట్టు తెలుస్తోంది. మరోపక్క మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్‌లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్టు చెబుతున్నారు. వినాయకన్ ప్రస్తుతానికి గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. వినాయకన్ ను అదుపులోకి తీసుకుని ఆర్జిఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనితో వినాయకన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మరోసారి అనడానికి కారణం ఏంటంటే.. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యాడు.
Also Read : Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో దద్దరిల్లే అప్డేట్