Jailer Record : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే రూ. 600 కోట్ల క్లబ్ లోకి చేరింది. జైలర్ కేరళలో రికార్డులు బ్రేక్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియాతో పాటు యోగి బాబు, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్, రమ్య కృష్ణన్ నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Jailer Record Viral
ఇక తమిళనాడులో రూ. 225 కోట్లు కొల్లగొట్టింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో దుమ్ము రేపింది. తాజాగా కేరళలో అరుదైన రికార్డు నమోదు చేసింది జైలర్(Jailer). అత్యంత లాభ దాయకమైన సినిమాగా నిలిచింది. ఆల్ టైమ్ అత్యధిక తమిళ చిత్రంగా నమోదైంది.
గతంలో ఎన్నో సినిమాలు విడుదలైనా ఇంతటి భారీ సక్సెస్ రాలేదు. ఆల్ టైమ్ రికార్డ్ షేర్ దక్కింది. అంతే కాదు ఆల్ టైమ్ ఓపెనింగ్ వీక్ గా నమోదు చేసింది. కొచ్చిన్ మల్టీ ప్లెక్స్ లలో ఆల్ టైమ్ రికార్డు తమిళ మూవీ గ్రాసర్ గా నిలిచింది. కేరళ భాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల గ్రాస్ , రూ. 20 కోట్లు దాటిన మొదటి తమిళ చిత్రంగా జైలర్ రికార్డు బ్రేక్ చేసింది. కేరళలో తొలిసారిగా రెండెంకల తమిళ చిత్రం లాభాలను ఆర్జజించడం విశేషం.
Also Read : Shilpa Shetty : సినీవాలిలో 30 ఏళ్లు – శిల్పా శెట్టి