Jailer Movie Rs 550 Club : యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తో పాటు ముద్దుగుమ్మ తమన్నా భాటియా , యోగి బాబు, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్, రమ్య కృష్ణ నటించారు.
ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా ఆరంభం నుంచే అదుర్స్ అనిపించేలా చేసింది. ఫస్ట్ షో కొంత మిశ్రమ స్పందన వచ్చినా ఆ తర్వాత జైలర్ కు అడ్డు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా వసూళ్ల వర్షం కురిసింది. ఇంకా ఈ చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ పరుగులు తీస్తున్నారు.
Jailer Movie Rs 550 Club in Collections
ఒకటవ వారంలోనే రూ. 450.80 కోట్లు కొల్లగొట్టింది జైలర్. 12 రోజుల లోపు జైలర్ రూ. 550 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం. ఇక వసూళ్ల పరంగా చూస్తే వివరాలు ఇలా ఉన్నాయి. రెండో వారంలో ఒకటవ రోజు రూ. 19.37 కోట్లు , 2వ రోఉ రూ. 17.22 కోట్లు, 3వ రోజు రూ. 26.86 కోట్లు, 4వ రోజు రూ. 29.71 కోట్లు, 5వ రోజు రూ. 12.54 కోట్లు వసూలు చేసింది జైలర్(Jailer). ఇటు ఇండియా అటు ఓవర్సీస్ తో కలుపుకుని మొత్తం ఇప్పటి దాకా సాధించిన వసూళ్లు రూ.556. 50 కోట్లు .
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్ లో ఎక్కువ సక్సెస్ అయిన చిత్రాలలో టాప్ లో నిలిచింది జైలర్. పా రంజిత్ తీసిన కాలా కూడా రికార్డు మోత మోగించింది.
Also Read : Gadar-2 Movie : గదర్ -2 చిత్రం కాసుల వర్షం