Jailer Movie Malaysia : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం దుమ్ము రేపుతోంది. ఈ సినిమాను అన్నీ తానై మోశాడు..నడిపించాడు 73 ఏళ్ల వయసు ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు తోడుగా తమన్నా భాటియా, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్య కృష్ణన్, కమెడియన్ యోగిబాబు కీలక పాత్ర పోషించారు.
Jailer Movie Malaysia
ఇటు ఇండియాతో పాటు అటు ఓవర్సీస్ ను ఊపేసింది జైలర్(Jailer Movie). ఇంకా జనం ఆదరిస్తూనే ఉన్నారు. పదే పదే చూస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా మలేషియాలో రజనీకాంత్ మేనియా కిర్రాక్ తెప్పించేలా చేసింది.
తాజాగా భారత్ కు వచ్చిన మలేషియా ప్రధాన మంత్రి స్వయంగా తలైవాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. భారత దేశ సినీ రంగంలో సూపర్ స్టార్ గా పేరు పొందిన రజనీకాంత్ లాంటి నటుడు ఇంత హంబుల్ గా , సాధారణంగా ఉంటారని తాను అనుకోలేదని తెలిపాడు.
ఎక్కడా అహంబావం అన్నది లేకుండా వ్యవహరించడం , రజనీకాంత్ వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. మొత్తంగా జైలర్ సినిమా మలేషియాను షేక్ చేసింది.
Also Read : Usthad Bhagat Singh : వారెవ్వా ఉస్తాద్ భగత్ సింగ్