Jailer Record : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ చిత్రం జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా విడుదలై ఊహించని రీతిలో సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు కోట్లు కొల్లగొట్టింది అతి తక్కువ సమయంలో.
Jailer Record Breaking
దర్శకుడి ప్రతిభ, తలైవా రజనీకాంత్ మేనరిజం, ఆకట్టుకునే సన్నివేశాలు, గుండెల్ని తాకే డైలాగులు ప్రేక్షకులను కట్టి పడేశాయి. దీంతో జైలర్(Jailer) ను నిర్మించిన సన్ పిక్చర్స్ కు భారీ ఆదాయం సమకూరింది. ఏకంగా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 650 కోట్లు వసూళ్లు సాధించింది.
రజనీకాంత్ సినీ కెరీర్ లో అతి పెద్ద సక్సెస్ సాధించిన చిత్రంగా నిలిచి పోయింది. సన్ పిక్చర్స్ అధినేత , డీఎంకే ఎంపీ కళానిధి మారన్ రూ.100 కోట్ల చెక్ తో పాటు కోటిన్నర బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు రజనీకాంత్ కు.
మరో వైపు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు కళ్లు చెదిరే కారుతో పాటు బ్లాంక్ చెక్కు అందజేశాడు నిర్మాత. తన అద్భుతమైన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కు రూ. 30 కోట్లు బహుమానంగా ఇచ్చాడు కళానిధి మారన్.
Also Read : Anushka Shetty : అనుష్క శెట్టి ఫుల్ హ్యాపీ