Jailer : అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తమిళనాట దుమ్ము రేపుతోంది రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా ఊహించని రీతిలో కాసులు కొల్లగొడుతోంది. యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 550 కోట్లను దాటేసింది వరల్డ్ వైడ్ గా.
Jailer Thalaivaa
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. దర్శకుడి టేకింగ్, మేకింగ్ అదిరింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కడే తానై వ్యవహరించాడు. మరోసారి తన మేనరిజాన్ని ప్రదర్శించాడు. ఆయనతో పాటు అందాల తార తమన్నా భాటియా డ్యాన్సులతో హోరెత్తించింది.
ఇక రజనీకాంత్ తో పాటు తమన్నా, యోగి బాబు, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ , రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తమిళనాడులో రూ. 200 కోట్లను దాటేందుకు రెడీగా ఉంది జైలర్(Jailer). ఒకటవ వారంలో రూ. 159.02 కోట్లు సాధించింది.
ఇక రెండో వారంలో 1వ రోజు రూ. 6.29 కోట్లు , 2వ రోజు రూ. 5.60 కోట్లు, 3వ రోజు రూ. 9.47 కోట్లు, 4వ రోజు రూ. 10.35 కోట్లు, 5వ రోజు రూ. 4.06 కోట్లు వసూలు చేసింది. మొత్తం ఇప్పటి వరకు రూ. 198.61 కోట్లు కొల్లగొట్టింది.
Also Read : Jailer Movie Rs 550 Club: రజనీ జైలర్ కాసుల వేట