తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. తమన్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్, యోగి బాబు, రమ్య కృష్ణన్ తో కలిసి తీసిన జైలర్ మూవీ రికార్డుల మోత మోగించింది. సన్ పిక్చర్స్ దీనిని నిర్మించింది. ఊహించని రీతిలో సక్సెస్ కావడమే కాదు తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు సంతోషాన్ని ఇచ్చింది.
దీంతో జైలర్ బిగ్ సక్సెస్ కావడంతో ముందస్తుగానే మరో కీలక ప్రకటన చేశారు నిర్మాత కళానిధి మారన్. ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చిన నిర్మాత జైలర్ -2 సీక్వెల్ కూడా తీస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు గాను ముందస్తు అడ్వాన్స్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు భారీ ఎత్తున ముట్ట చెప్పినట్లు టాక్.
రజనీకాంత్ కు మరిచి పోలేని రీతిలో రూ. 100 కోట్ల చెక్కుతో పాటు మూడున్నర కోట్ల విలువ చేసే కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. దర్శకుడికి బ్లాంక్ చెక్కుతో పాటు కాస్ట్ లీ కారును ఇచ్చాడు. అనిరుధ్ కు రూ. 30 కోట్లు ఇచ్చినట్లు ప్రకటించాడు. ఈ సినిమా విడుదలై నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ గుర్తు చేస్తూ..రజనీకాంత్ , దర్శకుడికి థ్యాంక్స్ తెలిపింది.