Jawan Box Office : యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో విడుదలైన జవాన్ చిత్రం కాసులు కొల్లగొడుతోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుక్ ఖాన్ , అందాల ముద్దుగుమ్మ నయనతార, లవ్లీ బ్యూటీ దీపికా పదుకొనే , విజయ్ సేతుపతి నటించిన జవాన్ ఆశించిన దానికంటే భారీ ఎత్తున ఆదరణ చూరగొంది.
Jawan Box Office Collections Trending
ఇటు భారత్ లో అటు ఓవర్సీస్ లో బాక్సులు కాసులు కొల్లగొడుతోంది. జవాన్(Jawan Box Office) చిత్రం సెప్టెంబర్ 7న గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే వసూళ్ల వేట కొనసాగించింది. నాలుగు రోజుల్లోపే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరింది జవాన్ చిత్రం.
ఇది హిందీ సినమా పరంగా చూస్తే అరుదైన రికార్డు గా చెప్పక తప్పదు. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బిగ్ హిట్ గా నిలిచాయి ఇప్పటికే. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ కూడా బాక్సులు బద్దలు కొట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక వసూళ్ల పరంగా చూస్తే తొలి రోజు రూ. 125.05 కోట్లు వసూలు సాధించగా , 2వ రోజు రూ. 109.24 కోట్లు, 3వ రోజు రూ. 140.17 కోట్లు, 4వ రోజు రూ. 156.80 కోట్లు కొల్లగొట్టింది. సినీ ట్రేడ్ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
Also Read : Megastar New Movie : మెగాస్టార్ తో వశిష్ట కొత్త సినిమా