G Marimuthu : తమిళనాడు – కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు జి. మరిముత్తు శుక్రవారం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రముఖ సినీ నటులు, టెక్నీషియన్స్ , దర్శకులు సంతాపం వ్యక్తం చేశారు.
G Marimuthu No More
సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జి. మరిముత్తు గొప్ప నటుడు అని , ఆయనను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబీకులకు సంతాపం తెలిపారు.
జి. మరిముత్తుకు(G Marimuthu) 57 ఏళ్లు. ఆయన సినీ తెరపై, బుల్లి తెరపై కూడా కనిపించాడు. తన అరుదైన నటనతో మెప్పించాడు. తమిళ టెలివిజన్ సీరీస్ ఎతిర్నీచల్ లో పేరు పొందాడు. మణిరత్నం వంటి దర్శకులతో కలిసి పని చేశాడు.
టీవీ సీరియస్ డైలాగులకు జి. మరి ముత్తు బాగా ప్రసిద్ది పొందాడు. పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . 50 సినిమాలకు పైగా నటించాడు. అరణ్య నైకిలి , ఎల్లమే ఎన్ రసతన్ వంటి చిత్రాలకు రాజ్ కిరణ్ తో కలిసి సహాయ దర్శకుడిగా పని చేశాడు. సిలంబరసన్ మన్మధన్ మూవీకి కో డైరెక్టర్ గా ఉన్నాడు.
Also Read : Rinku Singh : షారుక్ చిత్రం రింకూ సంతోషం