Jai Hanuman : ప్రశాంత్ వర్మ తీసిన ‘హనుమాన్’ ప్రపంచాన్ని తాకింది. ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్ లో 5 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ‘హనుమాన్(Hanuman)’ సినిమా సాధారణ టిక్కెట్ ధర తోనే లాభం పొందింది. స్టార్ హీరోల సినిమాల ధరలు పెంచినట్టు ఈ సినిమాకి కూడా పెంచితే … ఈపాటికే 500కోట్ల క్లబ్ లోకి చేరేది. ఓవర్సీస్ లో 10 మిలియన్లకు పైగా క్రాస్ చేసేది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అంటూ ముందుకు వచ్చాడు.
Jai Hanuman Movie Updates
జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని, ఆ పాత్రలో మహేష్ బాబు కూడా నటించాలని కోరుకున్నానని ప్రశాంత్ వర్మ అన్నారు. విడుదలయ్యే ఎడిట్ చిత్రాలను కూడా చూస్తానని, మా ఆఫీసులో రాముడిగా ఎడిట్ చేసిన మహేష్ బాబు చిత్రాలను కూడా చూశామని చెప్పారు. ఈ పాత్రకు మహేష్ బాబు ఒప్పుకుంటాడా? అసలు రాజమౌళి ఒప్పుకుంటాడా? లేదా? అనేది చూడాలి. వచ్చే రెండు మూడేళ్లలో మహేష్ బాబు అపాయింట్ మెంట్లన్నీ రాజమౌళి చేతిలోనే ఉన్నాయని తెలిసిందే.
ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ చిత్రంలో చిరంజీవిని ఆంజనేయుడుగా ఉహించుకున్నానని ఆ పాత్రలో ఆయన చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో హడావిడిగా ఉందని, అంతా పూర్తయిన తర్వాత ఆయనను కలిసి అడుగుతానని ప్రశాంత్ వర్మ చెప్పారు. మరి ఈ పాత్రకు చిరంజీవి ఓకే చెబుతాడా? లేదా? అనేది చూడాలి.
స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన స్క్రిప్ట్ మార్చుకోనని ప్రశాంత్ వర్మ అంటున్నాడు. నేను వాళ్ళ ఇమేజ్‌కి సరిపోయేలా అక్కడక్కడ కొన్ని మార్పులు చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి రాముడిగా మహేష్‌బాబు, ఆంజనేయుడిగా చిరంజీవి అనే కాన్సెప్ట్ ఎంత వరకు రియలైజ్ అవుతుంది? అస్పష్టంగా ఉంది. కొందరికి తెరపై చూడటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మరికొందరు కాంబినేషన్ అదిరిపొద్దని అంటున్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ?