Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెగ సంతోషానికి లోనవుతోంది. తను కీ రోల్ పోషించిన చిత్రం హౌం బౌండ్(Homebound). ఇది సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. అద్భుతమైన కథను తెరకెక్కించారు డైరెక్టర్. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఈ చిత్రం ఎంపికైంది. దీంతో ముచ్చట పడుతోంది. ఈ సందర్బంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Janhvi Kapoor Getting Appreciations
తన జీవితంలో మరిచి పోలేని సన్నివేశం ఇది. ఎందుకంటే ప్రతి నటికి తన కెరీర్ లో కొన్ని గుర్తుండి పోయే పాత్రలు, సినిమాలు అనేవి తప్పక ఉంటాయి. తన తల్లి శ్రీదేవి పేరు చెబితేనే మిస్టర్ ఇండియా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మంచి పాత్రలు, అంతకు మించిన దర్శకులు ఛాన్స్ లు ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. తన వరకు హోం బౌండ్ ను మరిచి పోలేనంటూ పేర్కొంది జాన్వీ కపూర్.
ఇదిలా ఉండగా ఈ మూవీలో ఇషాన్ కట్టర్ తో పాటు తను కూడా నటించింది. హౌం బౌండ్ ను అద్భుతంగా తీశాడు నీరజ్ ఘైవాన్. తమ సినిమా ప్రపంచ ప్రేక్షకుల ముందు ప్రదర్శించేందుకు ఛాన్స్ రావడం ఆనందంగా , గౌరవంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది జాన్వీ కపూర్. తామందరి మనసులు సంతోషంతో తేలి ఆడుతున్నాయంటూ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ఆ రోజు కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నానని స్పష్టం చేసింది.
Also Read : Hero Bunny-Arya 2 :ఆర్య 2 రీ రిలీజ్ రికార్డ్ బ్రేక్