Jack : ఒకప్పుడు ముద్దు అంటే చాలా భయపడే వాళ్లు సినిమాల్లో నటించే నటీ నటులు. ఇప్పుడు సీన్ మారింది. కిస్ లే కాదు సెక్స్ కూడా బహిరంగంగానే కొనసాగుతోంది. అదేమిటంటే ఇదంతే. ఆ మాత్రం దానికి స్వేచ్ఛ లేక పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలు, మోడల్స్, నటీమణులు అందాలను ఆర బోస్తున్నారు. అదే పనిగా పాపులర్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. గతంలో ఒకటి రెండు సినిమాలలోనే అలాంటి సీన్స్ ఉండేవి. ఇప్పుడు తెలుగు సినిమా రూటు మార్చేసింది.
Jack Movie Kiss Song Updates
దర్శకులు కాస్తా వయలెంట్ గా తయారవుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ముద్దులు, హగ్ లతో పిచ్చెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కిస్ లు ఎక్కువగా ఉంటే, ఎంతగా హింసతో చెలరేగి పోతే అంతలా హిట్ అవుతుందనే భ్రమల్లో పడి పోయారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే అద్భుతమైన కథను తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు భాస్కర్. తను తీసిన బొమ్మరిల్లు సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పక తప్పదు. ఆ మధ్యన అఖిల్ అక్కినేనితో తీశాడు. ఇందులో లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే కీలక పాత్ర పోషించింది.
అందులో అంతగా మోతాదు మించలేదు. ప్రస్తుతం మరోసారి తను సంచలనంగా మారాడు బొమ్మరిల్లు భాస్కర్. అదేమిటంటే యూత్ లో క్రేజ్ కలిగిన నటీ నటుల్లో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), వైష్ణవి చైతన్య పేరు పొందారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జాక్ అనే పూర్తి లవ్, రొమాంటిక్ , సస్పెన్స్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. కిస్ పేరుతో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ముద్దు కోసం సిద్దు చైతన్య ప్రైవసీ లేదంటూ వాపోవడం ఇందులో ప్రధాన అంశం. ప్రస్తుతం ఇది వైరల్ గా మారడం విశేషం.
Also Read : Hero Pawan-Hari Hara Veera Mallu :మే9న రానున్న హరిహర వీరమల్లు