IT Raids – Shocking Producers : మైత్రీ మూవీ మేక‌ర్స్ పై ఐటీ దాడులు

టాలీవుడ్ లో సోదాలు క‌ల‌క‌లం

Hello Telugu - IT Raids - Shocking Producers

IT Raids : హైద‌రాబాద్ – టాలీవుడ్ లో ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers)ఇళ్లు, నివాసాల‌లో సోదాలు కొన‌సాగుతున్నాయి. దిల్ రాజు, సోద‌రుడు, త‌న‌య స్నేహితా రెడ్డికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ బృందాలు త‌నిఖీలు చేప‌ట్టాయి. త‌ను ప్ర‌స్తుతం రెండు సినిమాల‌ను విడుద‌ల చేశారు.

IT Raids Shock to Mythri Movie Makers..

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ క‌లిసి న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ తో పాటు విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాలు ఉన్నాయి. గేమ్ ఛేంజ‌ర్ భారీ న‌ష్టాన్ని క‌లిగిస్తే సంక్రాంతికి వ‌స్తున్నాం మాత్రం దుమ్ము రేపుతోంది క‌లెక్ష‌న్ల ప‌రంగా . దేశీయంగా రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం ఓవ‌ర్సీస్ లో రూ. 100 కోట్లు వ‌సూల‌య్యాయి.

8 చోట్ల 55 బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండ‌గా బ్యాంక‌ర్లలో ఉన్న లాక‌ర్ల‌ను తెరిచి చూపించ‌డం జ‌రిగింద‌న్నారు. ఐటీ బృందాలు కోరిన మేర‌కు బ్యాంక‌ర్ల‌కు చెందిన లాక‌ర్ల‌ను తెరిచి చూపించామ‌ని చెప్పారు. తాము ఎక్క‌డా ఐటీ ఆదాయానికి గండి కొట్ట లేదంటూ ప్ర‌క‌టించారు. ప్ర‌తి పైసాకు లెక్క‌లు ఉన్నాయ‌ని తెలిపారు.

దిల్ రాజు తో పాటు ప్ర‌ముఖ గాయ‌ని సునీత భ‌ర్త‌కు చెందిన కంపెనీలో కూడా ఐటీ శాఖ దాడులు చేప‌ట్టింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ కార్యాల‌యాల్లో దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌డం విశేషం.

Also Read : Victory Venkatesh SV Movie : ఓవ‌ర్సీస్ లోనూ క‌లెక్ష‌న్స్ అదుర్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com