IT Raids : హైదరాబాద్ – ఐటీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది టాలీవుడ్(Tollywood) లో. దీంతో సినీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా నాలుగో రోజుకు చేరుకున్నాయి ఐటీ సోదాలు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో శుక్రవారం కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు జల్లెడ పట్టారు. సోదరుడు శిరీష్ ఇంట్లో తనిఖీలు ముగిశాయి. కూతురు స్నేహితా రెడ్డికి చెందిన ఇంట్లో దాడులు చేపట్టారు.
IT Raids on Tollywood Continues..
మరో వైపు దిల్ రాజు భార్య తేజస్వినిని ప్రశ్నించారు. ఆమెను తీసుకుని బ్యాంకుల వద్దకు వెళ్లారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆరా తీశారు. లాకర్లను ఓపెన్ చేయించారు. కీలక పత్రాలను పరిశీలించారు. మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తను ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా రెండు సినిమాలు విడుదల చేశారు దిల్ రాజు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు చెర్రీతో గేమ్ ఛేంజర్ తీయగా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వెంకటేశ్ తో అనిల్ రావిపూడిని పెట్టి సంక్రాంతికి వస్తున్నాం పేరుతో విడుదల చేసిన మూవీ దుమ్ము రేపింది. ఏకంగా 10 రోజుల్లోనే రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసింది.
మొత్తం మీద ఐటీ సోదాల కలకలం దావనలంలా వ్యాపించింది. టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.
Also Read : Hero Vijay Meet : రథసారథితో దళపతి ములాఖత్