Showering : చాలా మంది స్నానం చేసే క్రమంలో మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే కొంత మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు స్నానం చేసే సమయంలో మూత్ర విసర్జన చేయడం మంచిదేనా, ఇలా చేయడం వలన ఏవైనా అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం.
Showering health tips
స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడంపై వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
స్నానం(bathing)చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం అనేది ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. మూత్రం నిజానికి ఆరోగ్యకరమైనదని, మనం వెళ్లే మూత్రంలో ఎలక్ట్రోలైట్స్, యూరియా వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో బ్యాక్టీరియా కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంపై మూత్ర విసర్జన చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు, అలాగే స్నానం చేసే క్రమంలో మూత్ర విసర్జన చేయడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు వైద్యులు. కాకపోతే, బాత్ రూమ్ ఇతర వ్యక్తులు ఉపయోగిస్తున్నప్పుడు దానిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రధాన విషయం.
Also Read : Ginger Tea Health Tip : త్వరగా బరువు తగ్గాలా.. మీ కోసమే సూపర్ చిట్కా