Irugapatru Movie : ఈ మధ్యన భిన్నమైన కథలకు ప్రాణం పోస్తున్నారు దర్శకులు. ప్రత్యేకించి యువ డైరెక్టర్లు సినిమా కాన్వాస్ ను మరింత అందంగా ఉండేలా, అంతకు మించి భావోద్వేగాలను ప్రతిఫలించేలా చేస్తున్నారు. వాటిలో వచ్చినందే ఇరుగపాత్రు మూవీ. ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 6న విడుదలైంది. భారీ ఆదరణ చూరగొంటోంది.
Irugapatru Movie in Netflix
ఈ ఇరుగపాత్రు(Irugapatru) చిత్రానికి మహారాజ్ దయాళన్ రచించి, దర్శకత్వం వహించారు. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, పి. గోపీనాథ్ , తంగా ప్రభాహరన్, శ్రద్ధా శ్రీనాథ్ , విక్రమ్ ప్రభు నటించారు. గోకుల్ బెనోయ్ ఛాయాగ్రహణం అందిస్తే జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.
ఇక ఈ చిత్రం అక్టోబర్ 6న ఈ ఏడాది విడుదలైంది. తమళంలో వచ్చిన ఈ మూవీ రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కించాడు దయాళన్. అబర్నతి, సానియా అయ్యప్పన్ కూడా నటించడం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.
రాను రాను జీవితం మరింత సంక్లిష్టంగా తయారైంది. ప్రస్తుతం వైవాహిక జీవితం మరింత రోటిన్ గా మారి పోయింది. ఈ తరుణంలో జంటల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి. ఎలా వాటిని కాపాడుకుంటూ పరిరక్షించు కోవాలనే దానిపై ప్రధానంగా మనసు పెట్టి తీశాడు దర్శకుడు దయాళన్.
2021 ఆగస్టులో ప్రకటించారు దీనిని. ముందుగా నయన తారను అనుకున్నారు. కానీ ఆమె అట్లీ తీసిన జవాన్ మూవీలో బిజీగా ఉండడంతో ఒప్పుకోలేదు. చివరకు శ్రద్దా శ్రీనాథ్ ఒప్పుకుంది. టైటిల్ ను ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు.
Also Read : Ram Charan: దీపావళికి కానుకగా ‘గేమ్ ఛేంజర్’ సాంగ్