ప్రముఖ తమిళ సినీ నటి నయనతార , జయం రవి కలిసి తమిళంలో నటించిన ఇరైవాన్ చిత్రం సక్సెస్ అయ్యింది. దీనిని తెలుగులో గాడ్ పేరుతో శుక్రవారం విడుదల చేశారు మూవీ మేకర్స్. అహ్మద్ రచించి దర్శకత్వం వహించారు.
ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుధన్ సుందరం, జి. జయరామ్ నిర్మించారు. ఆశించిన దాని కంటే మంచి టాక్ వచ్చింది. రేటింగ్స్ లో అటు ఇటుగా ఉన్నప్పటికీ నయనతారకు ఉన్న క్రేజ్ ఈ చిత్ర విజయానికి ఉపయోగ పడింది.
ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వేదాంతం, మణికంద బాలాజీ నిర్వహించారు. ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 28న విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందింది.
జయం రవి , నయనతార నటన ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమాకు సంబంధించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు వివాదాస్పంగా మారాయి. ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ పేరుతో ఇవాళ విడుదల చేసింది.