Ira Khan Date Fix : అమీర్ కూతురు ఇరా పెళ్లి ఫిక్స్

జ‌న‌వ‌రి 3న జ‌రుగుతుంద‌న్న న‌టుడు

బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు పొందారు అమీర్ ఖాన్. తాను అమితంగా ప్రేమించే కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌నే స‌స్పెన్స్ కు తెర దించే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌త కొన్ని రోజులుగా ప్రేమ‌లో ప‌డిన ఇరాకు తీపి క‌బురు చెప్పాడు అమీర్ ఖాన్.

ఇదిలా ఉండ‌గా నూపుర్ శిఖ‌రేతో ఇరా ఖాన్ పీక‌ల లోతు ప్రేమ‌లో మునిగి పోయింది. వారికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు నెట్టింట్లో ఫుల్ వైర‌ల్ గా మారాయి. దీంతో గ‌త ఏడాది ఈ ఇద్ద‌రికీ నిశ్చితార్థం జ‌రిపించారు అమీర్ ఖాన్ ద‌గ్గ‌రుండి.

తాజాగా త‌న కూతురు పెళ్లిని ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించాడు అమీర్ ఖాన్ ఇవాళ‌. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3న ముహూర్తం నిర్ణ‌యించాన‌ని, ఆరోజు తాను ఏడుస్తానంటూ వాపోయాడు ఈ అగ్ర న‌టుడు.

నూపుర్ శిఖ‌ర్ ఎవ‌రో కాదు న‌టుడు కూడా. వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. క‌లిసి ఇంత కాలం ఉన్నారు. అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. ఈ సంద‌ర్బంగా అమీర్ ఖాన్ పేర్కొంటూ..త‌న‌ను అభిమానించే వారంతా త‌న కూతురు ఇరా ఖాన్ ను ఆశీర్వ‌దించాల‌ని కోరాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com