Indrani Davuluri : ఇంద్రాణి దవులూరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాట్యకారిణిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందారు. తన జీవితం నాట్యానికి అంకితం చేశారు. ప్రధానంగా భారత నాట్యం గురించి చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజు రోజుకు భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ అరుదైన నాట్య ప్రక్రియను బతికించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొంటున్నారు.
Indrani Davuluri ‘Andela Ravamidi Teaser
ఇందులో భాగంగానే తను స్వీయ దర్శకత్వంలో అందెల రవమిది(Andela Ravamidi) అనే పేరుతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఆవిష్కరించారు. తను మాట్లాడుతూ తనకు గత కొంత కాలం నుంచి ఇంద్రాణి దవులూరి(Indrani Davuluri) తెలుసునని చెప్పారు. తను సినిమా రంగానికి సంబంధించి కొత్తగా అయినప్పటికీ అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసిందంటూ కొనియాడారు. ఇంద్రాణిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
నాట్య మార్గం ప్రొడక్షన్స్ పతాకంపై దీనిని తీస్తున్నారు . ప్రస్తుతం తను అమెరికాలో ఉంటూ కళలు, సంస్కృతి మీద గౌరవంతో పిల్లలకు క్లాసికల్ నృత్యం నేర్పిస్తున్నారు. సంస్కృతి ఔన్నత్యం గురించి తెలియ చెప్పేందుకే అందెల రవమిది అని సినిమా తీశారన్నారు.
భరత నాట్యానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది 2 వేల ఏళ్ల నాటి కళ. దీనిని బతికించు కోవాల్సిన అవసరం ఉందన్నారు నాట్యకారిణి, దర్శకురాలు ఇంద్రాణి దవులూరి. ఈ చిత్రంలో ఆదిత్య మీనన్, తనికెళ్ల భరణి నటిస్తుండగా కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు.
Also Read : Taapsee Pannu Sensational :రంగోలి కామెంట్స్ తాప్సీ సీరియస్