Indra Re-Release: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌ గా ‘ఇంద్ర’ రీ రిలీజ్ !

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌ గా ‘ఇంద్ర’ రీ రిలీజ్ !

Hello Telugu - Indra Re Release

Indra: ఆగస్టు 22 అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉండే మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు ఏడాదికి ఒకటి లేదా రెండేళ్ళకు ఒకటి రిలీజ్ కావడంతో అభిమానులు పాత హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో సైతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ ని ఫ్యాన్స్ కోసం ఫ్యాన్సే రీ రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ రీ రిలీజ్‌లో కూడా ఆ సినిమాలు రికార్డ్ కలెక్షన్స్‌ని వసూలు చేస్తుండటంతో… ఈ రీ-రిలీజ్‌ల హవా మరింతగా పెరిగిపోతోంది.

Indra Re-Release…

ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరు నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఇంద్ర(Indra)’ సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. గతేడాది చిరంజీవి బర్త్‌ డేకి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ.. చివరి నిమిషంలో విరమించుకున్నారు. కానీ ఈసారి మాత్రం అలాకాదు… ముందుగానే అన్నీ సిద్ధం చేసి ‘ఇంద్ర(Indra)’ రీ-రిలీజ్ ప్రకటన కూడా చేసేశారు. చిరంజీవి బర్త్‌ డేను పురస్కరించుకుని ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వైజయంతీ మేకర్స్ ప్రకటించారు.

అశ్వనీ‌దత్ కు చెందిన వైజయంతి మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్‌ని సెలబ్రేట్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ను గ్రాండ్ రీ-రిలీజ్‌‌కు తెస్తున్నారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై జూలై 24కి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ‘ఇంద్ర’ సినిమా 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా అప్పట్లో రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ సౌత్‌ అవార్డులను గెలుచుకుంది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రెండింటినీ గెలుచుకున్నారు. చిరంజీవితో వైజయంతీ మూవీస్ అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించింది. ‘ఇంద్ర’ సినిమా ఆ బ్యానర్‌కు మోస్ట్ మెమరబుల్ మూవీ. ఈ చిత్రానికి VSR స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మణి శర్మ చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

Also Read : Yevam: ఓటీటీ లోనికి చాందిని చౌదరి ‘యేవమ్‌’ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com