Amigo Movie : దేశంలోనే మొట్టమొదటి సైబర్ ఫాంటసీ థ్రిల్లర్

ఈ అమిగో చిత్రం ఆన్‌లైన్‌ గేమ్‌లో చిక్కుకున్న స్నేహితుల బృందం చుట్టూ తిరుగుతూ...

Hello Telugu - Amigo Movie

Amigo : యువ నటి చాందిని తమిళరసన్(Chandini Tamilarasan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమిగో’. దేశంలోనే తొలిసారి సైబర్‌ ఫాంటసీ హర్రర్‌ మూవీగా రూపుదిద్దుకుంది. డెబ్యూ డైరెక్టర్‌ బి.ప్రవీణ్ దర్శకత్వంలో చాందిని తమిళరసన్, అర్జున్‌ సోమయాజులు, సువితా రాజేంద్రన్, ప్రవీణ్‌ ఇలంగో , వత్సన్‌ చక్రవర్తి, మనీషా జిష్నానీ , భాగ్య తదితరులు నటించారు. ‘ అయలి’ వెబ్‌ సిరీస్‌ ఫేం రేవా సంగీతం అందించారు. ప్రత్యగ్రా మోషన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై బి.గిరిజ నిర్మించారు.

Amigo Movie Updates

ఈ సినిమా గురించి దర్శకుడు ప్రవీణ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా భారతదేశంలోనే తొలిసారి సైబర్‌ ఫాంటసీ హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించామ‌ని.. భారతీయ చిత్రపరిశ్రమ ఒకసారి వెనక్కి తిరిగి చూసేలా వినూత్నంగా ఉంటుందన్నారు. ఈ అమిగో చిత్రం ఆన్‌లైన్‌ గేమ్‌లో చిక్కుకున్న స్నేహితుల బృందం చుట్టూ తిరుగుతూ.. ప్రేక్షకులకు అద్భుతమైన ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ ఫీచర్‌ అనుభూతినిస్తుందన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో కొత్త విషయాలను బహిర్గతం చేస్తుందని.. ఇవి ప్రేక్షకులు సైతం బయపడేలా, ఆశ్చర్యపోయేలా చేస్తుందన్నారు. భారతీయ చిత్రపరిశ్రమలో ఈ చిత్రానికి ఖచ్చితంగా ఒక గుర్తింపు వస్తుందని భావిస్తున్నామ‌ని ఆన్‌లైన్‌ ప్రపంచంలో నిత్యం మునిగి ఉండే ఫ్రెండ్స్‌ బృందంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి, వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? వారి జీవితాలను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టాడు? ఆ గుర్తు తెలియని నేరగాడి వల నుంచి స్నేహితుల బృందం తప్పించుకుందా? లేదా? అనేది కథాంశంలో ఒక మంచి గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో రూపొందించాం’ అని వివరించారు.

Also Read : Mayan Movie : 4 ఏళ్ల తర్వాత వస్తున్న ప్రియాంక మోహన్, బిందు మాధవిల ఫాంటసీ థ్రిల్లర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com