Indian Police Force: ఓటీటీలో దుమ్మురేపుతోన్న బాలీవుడ్ స్టార్స్ తొలి వెబ్ సిరీస్‌ !

ఓటీటీలో దుమ్మురేపుతోన్న బాలీవుడ్ స్టార్స్ తొలి వెబ్ సిరీస్‌ !

Hello Telugu - Indian Police Force

Indian Police Force: బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ మల్హోత్రా, వివేక్‌ ఓబెరాయ్, నటి శిల్పాశెట్టి న‌టించిన భారీ యాక్ష‌న్ వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. రిలయన్స్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌ , రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత, దర్శకుడు రోహిత్ శెట్టి మ‌రో డైరెక్ట‌ర్‌ సుశ్వంత్ ప్రకాష్‌ తో క‌లిసి దర్శకత్వం చేశారు. సింగం, సూర్యవంశీ, సింబా వంటి సినిమాలను తెరకెక్కించిన రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే. శ్వేతా తివారి, ముకేష్‌ రిషి, నికితిన్‌ ధీర్‌, రితురాజ్‌ సింగ్‌, లలిత్‌ పరిమో, శరద్ ఖేల్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా… బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్ లు కూడా ఈ వెబ్ సిరీస్ లో గెస్ట్ అప్పియ‌రెన్స్‌ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో భారీ అంచనాల నడుమ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Indian Police Force Web Series Updates

టెర్రరిస్టులకు, పోలీసులకు మధ్య జరిగే కథతో థ్రిల్లింగ్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఆద్యంతం అల‌రించేలా రూపొందించిన ఈ వెబ్ సిరీస్… ప్రముఖ ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. సుమారు 4.30 గంట‌ల పాటు సాగే ఈ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో ఎటువంటి మసాలా, బోల్డ్ సీన్స్ లేకుండా తెరకెక్కించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనితో ఓటీటీలో(OTT) ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది.

‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ కథేమిటంటే ?

ఢిల్లీలో కొన్ని ప్ర‌దేశాల్లో స‌డ‌న్‌ గా బాంబులు పేలుతాయి. వాటిని ఎవ‌రు పేల్చారు, వారి మోటివేష‌న్ ఏంట‌నేది తెలుసుకోవ‌డానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ క్ర‌మంలో బాంబులు పెట్టిన వారిని ప‌ట్టుకున్నారా లేదా అనే ఇతివృత్తంలో క‌థన ఆథ్యంతం ఉత్కంఠగా తెరకెక్కించారు రోహిత్ శెట్టి, సుశ్వంత్ ప్రకాష్‌ దర్శకుల ద్వయం. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్ మొత్తం విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీన్స్‌ అద్భుతంగా ఉండటంతో పాటు మ‌ధ్య‌లో ఒక‌టి రెండు పాట‌లు కూడా ఉన్నాయి.

Also Read : Vijay Devarakonda: ప్రభాస్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com