ముంబై – భారతీయ బుల్లి తెరపై మోస్ట్ పాపులర్ షోస్ లలో ఏదైనా ఉందంటే అది ఐడల్ ప్రోగ్రాం. ప్రముఖ రియాలిటీ షోగా ఇది గుర్తింపు పొందింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిభా సామర్థ్యం కలిగిన కళాకారులకు ఇది వేదికగా మారింది. వేలాది మందిని ఈ షో బయటకు తీసుకు వచ్చింది.
కళాకారులు, గాయనీ గాయకులు ప్రదర్శిస్తున్న ప్రదర్శన చూసిన వారంతా విస్తు పోతున్నారు. అద్బుతమైన టాలెంట్ తో తమను తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఈ ఇండియన్ ఐడల్ కు భారీ ఎత్తున ప్రజాదరణ లభిస్తోంది.
ఇప్పటి వరకు సోనీ ఇండియన్ ఐడల్ 13 ఎపిసోడ్ లు పూర్తయ్యాయి. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో రియాలిటీ షో నిర్వహించేందుకు గాను డేట్ ఫిక్స్ చేశారు. ఈ సీజన్ భారీ సక్సెస్ అయ్యింది. తాజాగా 14వ సింగింగ్ షోకు రెడీ అయ్యింది. ఈ రియాలటీ షోకు భారీ ప్రత్యేకతలు ఉండేలా జాగ్రత్త పడుతోంది వినోద సంస్థ.
అక్టోబర్ 6న స్ట్రీమింగ్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సోనీ లివ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ పోటీకి భారతీయ సంగీత రంగంలో ముగ్గురు ప్రముఖులైన కుమార్ సాను, శ్రేయా ఘోషల్ , విశాల్ దద్లానీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.