Indian 2: టీజర్ ను విడుదల చేయనున్న రాజమౌళి

ఇండియన్ 2 సినిమా టీజర్ ను విడుదల చేయున్న రాజమౌళి

Teluguism-Indian 2

ఇండియన్-2 టీజర్ ను విడుదల చేయనున్న దర్శకధీరుడు రాజమౌళి

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’ (Indian 2) టీజర్ రిలీజ్ కు చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ ను దర్శకుడు శంకర్ బడా స్టార్లను దించుతున్నారు. హిందీలో అమీర్ ఖాన్, తమిళంలో రజనీకాంత్, తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్ చేత టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసింది. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో అగ్ర హీరోల చేత టీజర్ ను విడుదల చేయిస్తుండగా తెలుగులో మాత్రం దర్శకుడు రాజమౌళి టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని ‘యాన్ ఇంట్రో’ పేరుతో లైకా ప్రొడక్షన్స్ తన అఫీషియన్ సోషల్ మీడియా లో ప్రకటించింది. శుక్రవారం (నవంబరు 3) సాయంత్రం 5.30 గంటలకు ‘ఇండియన్ 2’ టీజర్ విడుదల చేయడం ద్వారా దర్శకుడు రాజమౌళి భారతీయుడిని పరిచయం చేయబోతున్నారు. దీనికోసం లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ పోస్టల్ స్టాంప్ ఆకారంలో పోస్టర్లు డిజైన్ చేసి తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుండి ట్వీట్ చేసింది.

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డబుల్ యాక్షన్ లో 1996లో నిర్మించిన భారతీయుడు సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ సన్సేషన్. స్వాతంత్ర సమరయోధుడిగా, అవినీతిని అన్యాయాన్ని వ్యతిరేకించే భారతీయుడిగా కమల్ హాసన్ నటన అద్భుతం. ఇక ఈ సినిమాతో శంకర్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మనీషా కొయిరాల అందాలు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్.

అయితే, ఇప్పుడు సుమారు 27 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వస్తోంది. శంకర్-కమల్ హాసన్ (Kamal Haasan) కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’ (Indian 2) సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయ్యింది. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అదేవిదంగా రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనితో చిత్ర దర్శకుడు శంకర్ చిత్ర ప్రచార కార్యక్రమాలను షురూ చేసే పనిలో పడ్డారు.

ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్‌డేట్స్ తప్ప లుక్ కానీ, ఇతర ఏ విధమైన ప్రమోషనల్ కంటెంట్ కానీ ఇంతవరకు విడుదల చేయలేదు. మొత్తానికి దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా రేపు టీజర్‌ను తీసుకొస్తున్నారు. నిజానికి ఈ సినిమా కోసం అటు కమల్ హాసన్ అభిమానులతో పాటు ఇటు శంకర్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది వీఎఫ్ఎక్స్ ఆధారంగా రూపొందే సినిమా కాబట్టి ప్రీ ప్రొడక్షన్‌కు సమయం ఎక్కువే పడుతుంది. తెలుగులో ‘భారతీయుడు 2’గా ఈ సినిమా విడుదలకానుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com