దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సీక్వెల్ గా రాబోతోంది ఇండియన్ -2 మూవీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కు శ్రీకారం చుట్టనున్నారు దర్శకుడు. ఈ మూవీతో పాటు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ తీస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తెలుగులో గత కొన్నేళ్ల కిందట వచ్చిన నాయకుడు సెన్సేషన్ గా నిలిచింది. టేకింగ్ లో మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక దర్శకుడు శంకర్. ఇక నటనలో తనకు సాటి రారు ఎవరూ అనే రీతిలో ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసే కమల్ హాసన్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించ బోతున్నాడు ఇండియన్ -2 మూవీలో.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అంతా శంకరే. 1996లో విడుదలైన ఆనాటి సినిమా దేశంలో ఒక చర్చకు దారి తీసేలా చేసింది. అందులో సేనాపతిగా నటించాడు. తాజాగా విడుదల కాబోయే ఇండియన్ 2 లో భారతీయుడిగా నటించనున్నారు కమల్ హాసన్.
అవినీతిపై పోరాడే ఇండియన్ గా మరోసారి కనిపించ బోతున్నారు. ఈ చిత్రంలో సిద్దార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవానీ శంకర్ , కాళీదాస్ జయరామ్ , గుల్షన్ గ్రోవర్ , వేణు, వివేక్ , సముద్ర ఖని, బాబి సింహా , సోమసుందరం, ఢిల్లీ గణేష్ , జయప్రకాష్ , మనోబాల , వెన్నెల కిషోర్ నటిస్తున్నారు.