కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నాయకుడు కాంబినేషన్ లో వస్తున్న సీక్వెల్ చిత్రం ఇండియన్ 2 కు సంబంధించి అప్ డేట్ వచ్చింది. లోక నాయకుడు కమల్ హాసన్ మరోసారి తన విశ్వ రూపాన్ని ప్రదర్శించేందుకు సిద్దమయ్యాడు. ఈ చిత్రానికి దర్శకుడు మణిరత్నం. సంగీతం అందిస్తోంది అల్లా రఖా రెహమాన్. ఇప్పటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇండియన్ 2 కు సంబంధించి ఫస్ట్ లుక్ ను నవంబర్ 3న రానుందని మూవీ మేకర్స్ ఇవాళ ప్రకటించారు. దీంతో లోకనాయకుడి ఫ్యాన్స్ తెగ సంతోషానికి లోనవుతున్నారు. ఈ చిత్రాన్ని రాజకీయ, యాక్షన్, థ్రిల్లర్, డ్రామాకు ప్రయారిటీ ఇస్తూ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు శంకర్.
ఈ మూవీని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ అనే సరికల్లా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ 2 చిత్రంలో ఉలగ నాయకన్ కమల్ హాసన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ , సిద్దార్థ్ , ప్రియా భవానీ శంకర్ , సముద్రఖని, బాబీ సింహా , సునీల్ గ్రోవర్ , వివేక్ , వేణు కీలక పాత్రలు పోషిస్తున్నారు.