Indian-2 Movie : భారతీయ సినిమా జగత్తులో అత్యంత జనాదరణ పొందిన ఏకైక దర్శకుడు ఎ. శంకర్. తమిళ సినీ రంగానికి చెందిన ఆయన ఏది చేసినా అది సంచలనమే. తీసిన చిత్రాలు తక్కువే అయినా ప్రతి ఒక్క చిత్రం ఓ సెన్సేషన్.
దిగ్గజ నటుడు కమల్ హాసన్ తో తీసిన భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. ఆ చిత్రానికి ఇండియన్ -2 పేరుతో సీక్వెల్ తీస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో దీనిని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
Indian-2 Movie Updates
కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చే ఈ సీక్వెల్ సినిమా ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. భారతీయుడు 1996లో విడుదలైంది. కోట్లు కొల్లగొట్టింది. ఇక తాజాగా ఇండియన్ -2(Indian-2)లో లోక నాయకుడు కమల్ హాసన్ సేనాపతిగా, భారతీయుడిగా తన పాత్రను తిరిగి పోషిస్తున్నాడు. పాత స్వాతంత్ర సమర యోధుడు విజిలెంట్ గా మారాడు.
ఈ సినిమాకు కర్త, కర్మ అంతా దర్శకుడు ఎ. శంకర్ దే. తమిళ భాషా యాక్షన్ చిత్రంగా రూపొందించే పనిలో పడ్డాడు. అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే పాత్ర ఇది.
ఇండియన్ -2 చిత్రంలో కమల్ హాసన్ తో పాటు సిద్దార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవానీ శంకర్, కాళిదాస్ జయరామ్ , గుల్షన్ గ్రోవర్ , నేదురు మూడి వేణు, వివేక్ , సముద్ర ఖని, బాబీ సింహా, గురు సోమ సుందరం, ఢిల్లీ గణేశ్ , జయప్రకాశ్, మనో బాల, వెన్నెల కిషోర్ , దీపా శంకర్ ఇందులో నటిస్తుండడం విశేషం.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండడం విశేషం. గతంలో సినిమాలకు ఏఆర్ రెహమాన్ ఇచ్చే వారు. కానీ సీన్ మారింది.
Also Read : Jailer Box Office : రజనీకాంత్ జైలర్ కలెక్షన్స్ సూపర్