Indian-2: సేనాపతి 2.o గా కమల్ హాసన్

Hellotelugu-Indian-2 working still

సేనాపతి 2.o గా కమల్ హాసన్

Indian-2 : అవినీతి అధికారుల పాలిట సింహస్వప్నం… వీరశేఖరన్ సేనాపతి…. ఈ పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సమకాలీన సామాజిక సమస్య లంచం ఇతివృత్తంగా సరిగ్గా 27 ఏళ్ళ క్రితం శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు). వీరశేఖరన్ సేనాపతి గా కమల్ హాసన్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకుల గుండెల్లో నేటికీ చెదరని ముద్ర వేసింది. అందుకే ఇప్పుడీ వీరశేఖరన్ సేనాపతిని ఇండియన్-2(Indian-2) (తెలుగులో భారతీయుడు-2) గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నదాడు దర్శకుడు శంకర్. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో కాజల్‌ కథానాయిక.

సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్-2 చిత్రంకు సంబందించి ఓ వర్కింగ్‌ స్టిల్‌ను దర్శకుడు శంకర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో కమల్‌ హాసన్.. సేనాపతి లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. ఇండియన్ లో వీరశేఖరన్ సేనాపతికి అప్ డేటెడ్ వెర్షన్ సేనాపతి 2.o గా కమల్ హాసన్ లుక్ సూపర్బ్ అంటూ అభిమానులు నుండి విశేష స్పందన వస్తుంది.

Indian-2 – ‘శంకర్’ ఎమోషనల్ కొటేషన్

‘‘సేనాపతిని తిరిగి తీసుకురావడానికి మీతో మళ్లీ పని చేసే అవకాశం రావడం అద్భుతం. మీరు మమ్మల్ని అలరిస్తూనే ఉంటారని.. మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను’’ అని ఆ స్టిల్‌కు శంకర్‌ ఓ కొటేషన్ ను జోడించారు. ఇది ఇలా ఉండగా ఇండియన్-2 కు సంబందించి కొత్త షెడ్యూల్‌ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే వారం నుంచి మొదలు కానుందని సమాచారం. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో విజయవాడ, వైజాగ్‌ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. గతంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఆర్‌.రత్నవేలు, రవి వర్మ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.

Also Read : NTR: యుద్ధానికి సిద్ధం అంటున్న తారక్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com