IND vs PAK : దుబాయ్ – దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. ఆతిథ్య జట్టు పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా తటస్థ వేదిక దుబాయ్ లో ఇవాళ తన చిరకాల ప్రత్యర్థి భారత(India) జట్టుతో తల పడనుంది. సుదీర్ఘ కాలం తర్వాత ఇరు జట్లు పోటీ పడుతుండడంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ లు జోరుగా కొనసాగుతున్నాయి.
IND vs PAK Cricket Match Updates
టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓటమి పాలైంది. మరో వైపు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరింత బలంగా తయారైంది. పాకిస్తాన్ ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తామని ఇప్పటికే ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
స్టార్ యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ బంగ్లా క్రికెటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్దమైంది. మరో వైపు ఇండియా జట్టుకు తిరిగి వచ్చిన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సూపర్ స్పెల్ తో ఆకట్టుకుంటున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యాడు.
మొత్తం మీద పాకిస్తాన్, భారత జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ను కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా వీక్షించేందుకు సిద్దమయ్యారు. మరో వైపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేశారు.
Also Read : Hero Pawan Kalyan :పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పదిలం