In the Belly of a Tiger: బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్ కు తెలుగు దర్శకుడి సినిమా !

బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్ కు తెలుగు దర్శకుడి సినిమా !

Hello Telugu - In the Belly of a Tiger

In the Belly of a Tiger: తెలుగు దర్శకుడు సిద్ధార్థ జటలకు అరుదైన గౌరవం దక్కింది. సిద్ధార్ధ దర్శకత్వం వహించిన ‘ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఎ టైగర్‌’… 74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Berlin International Film Festival) కు ఎంపికైంది. జర్మనీలోని బెర్లిన్‌లో ఈ నెల 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇందులో 18, 19, 22, 23 తేదీల్లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు బెర్లిన్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ నుండి దర్శకుడు సిద్ధార్ధ, చిత్ర యూనిట్ కు సమాచారం అందింది. దీనితో దర్శకుడు సిద్ధార్ధ్ తో పాటు ‘ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఎ టైగర్‌’ చిత్ర యూనిట్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగోడి సత్తా చాటావంటూ… దర్శకుడు సిద్ధార్ధ్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

In the Belly of a Tiger – ‘ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఎ టైగర్‌’ సినిమా కథేమిటంటే ?

తెలుగు దర్శకుడు సిద్ధార్థ జటల తెరకెక్కించిన ‘ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఎ టైగర్‌(In the Belly of a Tiger)’ సినిమా కథ విషయానికి వస్తే… ‘‘లక్నో దగ్గరున్న ఓ ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమానున రూపొందించారు. వాస్తవ కథకు కాస్త ఫిక్షన్‌ను జోడించి సోషియో ఫాంటసీ అంశాల్ని మిళితం చేసి ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సిద్ధార్ధ. ఈ కథ ప్రధానంగా భాగోలే, ప్రభాత అనే ఇద్దరు రైతుల చుట్టూ తిరుగుతుంది. వాళ్లు వర్షాభావ పరిస్థితులు… అప్పుల కారణంగా తమ పొలాల్ని అమ్మేసుకుంటారు. ఫలితంగా వారి జీవితాలు మరింత దుర్భరమవుతాయి. ఆ దశలో వాళ్లలో ఒక పెద్దాయన కుటుంబం కోసం ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. తమ ఊరికి దగ్గర్లో ఉన్న టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోకి వెళ్లి పులికి ఆహారమవ్వాలని నిర్ణయించుకుంటాడు. అలా పులి చేతిలో చచ్చిపోతే తన కుటుంబానికి రూ. 10లక్షల పరిహారం వస్తుందనుకొని అరణ్యంలోకి వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది ? అన్నది ఆసక్తికరం.

ఈ సినిమాలో అంతర్లీనంగా ఓ మంచి సందేశం ఉంది’’ అని దర్శకుడు సిద్ధార్ధ తెలిపారు. ఈ సినిమాలో లారెన్స్‌ ఫ్రాన్సిస్‌, ఉమేష్‌ శుక్లా, పూజా పల్లవి, పూనమ్‌ తివారి, రోస్లిన్‌ రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భైరవి ఫిల్మ్స్‌, వండర్‌ పిక్చర్స్‌, జీవీ ఫిల్మ్స్‌ పతాకాలపై శారద ఉమ, లీ ఫాంగ్‌, భావన గోపరాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి రసూల్‌ పుకుట్టి సౌండ్‌ డిజైనర్‌.

Also Read : Tillu Square Trailer : ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com