Devara : కామెడీ అనేది ఎంత ఆహ్లాదం ఇస్తోందో హద్దులు దాటితే అంతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా జరిగిన అలాంటి ఘటనే తెలుగు ఆడియెన్స్ మనోభావాలని దెబ్బతీస్తోంది. హిందీలో కామెడీ నైట్స్ విత్ కపిల్ షో ద్వారా కపిల్ శర్మ ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ ఉందంటే చాలు బాలీవుడ్ నుంచే కాదు సౌత్ నుంచి కూడా మేకర్స్ కపిల్ షో కి పరిగెత్తుతారు. తాజాగా ‘దేవర(Devara)’ సినిమా ప్రమోషన్స్‌కి ఎన్టీయార్ కూడా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఈ షోకి వెళ్లారు. ఈ క్రమంలో షోలో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి స్పూఫ్ చేశారు. మొదట్లో బాగనిపించినప్పటికీ రాను రాను హద్దు దాటినట్లు అనిపించిందని కొంతమంది అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Devara Promotions…
కపిల్ షో అంటేనే స్పూఫ్,పేరడీలకు పెట్టింది పేరు. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లను కూడా ఆ షోలో ఈజీగా స్పూఫ్‌తో ఆట పట్టించారు. కానీ.. దేవర(Devara) ప్రమోషన్లో భాగంగా చేసిన స్పూఫ్ మాత్రం తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. కపిల్ షోలోని మరో కమెడియన్ వరుణ్ గ్రోవర్ రాజమౌళి పాత్రను స్పూఫ్ చేశాడు. రాజమౌళి పేరును ‘రాజాగోళి’గా మార్చి సెటైర్లు విసిరారు. అలాగే జక్కన హిందీ మాట్లాడే విధానాన్ని అవహేళన చేస్తూ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేశారు. ప్రతి మూవీలోనును గ్రీన్ స్క్రీన్, విఎఫెక్స్ వాడే విధానంపై చతుర్లు విసిరారు. కొన్ని సన్నివేశాలలో తారక్ చాలా ఆన్ కంఫర్టబుల్‌గా నవ్వారు. దీంతో ఇది చాలా మంది ఆడియెన్స్‌లో నవ్వులు పూయించిన జక్కన్నని నేషన్ ప్రైడ్ గా భావించే ఆడియెన్స్‌లో మాత్రం ఉద్వేగాలను రెచ్చగొట్టింది.
ఏది ఏమైనప్పటికీ కామెడీ హద్దులో ఉండటమే అందరికి మంచిది. అయితే కామెడీ అనేది చాలా సెన్సిటివ్ అండ్ డీప్ టాపిక్. ఎంత ఎక్స్ పోజర్ కలిగి ఉంటె అంతలా కామెడీని ఆస్వాదించవచ్చు. ఈ టాపిక్‌పై కొందరు మాట్లాడుతూ.. ‘ఎందుకు హర్ట్ అవ్వాలి కామెడీ అంటేనే అంతా.. ఒకరిని కించపరచాలి అనే ఉద్దేశం అతనిది కాదని’ సమర్థిస్తున్నారు. నిజానికి కపిల్ శర్మ ఇన్‌సల్ట్ కామెడీ జోనర్‌లో ప్రావీణ్యం పొందినవాడు. ఆ కామెడీ ఉద్దేశం నవ్వించడమే కానీ కించపరచడం కాదు. ఏది ఏమైనప్పటికి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న ఈ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ లేవుతోంది.
Also Read : 35 Movie OTT : కుటుంబ కథా చిత్రం ’35 చిన్న కథ కాదు’ ఓటీటలో