Srikanth Iyengar : ప్రస్తుతం టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న నటుల్లో శ్రీకాంత్ అయ్యంగర్ ఒకరు. కమెడియన్, విలన్, సహాయక నటుడి పాత్రలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారాయన. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో శ్రీకాంత్ అయ్యంగర్(Srikanth Iyengar) బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన నటించిన పొట్టేల్ సినిమా ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్. జర్నలిస్టులు, రివ్యూయర్లను బూతులు తిట్టారు. దీంతో జర్నలిస్ట్ సంఘాలు ఆయనపై మండి పడ్డాయి. దీంతో దిగివచ్చిన అయ్యంగర్ వారికి క్షమాపణలు చెప్పాడు. ఇలా నిత్యం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోన్న శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు ఆడియెన్స్ కు మరో షాక్ ఇచ్చారు. ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి(Jyothi) తో కలిసి ఆయన ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తనకు జ్యోతి ముద్దు పెడుతోన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీకాంత్.. ‘క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?’ అంటూ క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చారు.
Srikanth Iyengar Marriage..
శ్రీకాంత్ అయ్యంగర్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజనలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది శ్రీకాంత్, జ్యోతిలకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తెలుగులో 20కు పైగా సినిమాల్లో నటించాడు శ్రీకాంత్ అయ్యంగర్. 2014లో బసంతి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన కరోనా వైరస్, దిశ ఎన్ కౌంటర్, మర్డర్ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ఏడాది ఆయన నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఆయన డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మ లాగానే శ్రీకాంత్ అయ్యంగర్ ఏదైనా సూటిగా మాట్లాడుతాడు. అది తన సోషల్ మీడియా పోస్టుల్లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా పొట్టేల్ సినిమా ఫంక్షన్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Also Read : Kollywood Producers : సినిమా రివ్యూయర్ల పై ధ్వజమెత్తిన కోలీవుడ్ నిర్మాతలు