Ileana d’cruz : టాలీవుడ్ లో జీరో సైజ్ బ్యూటీ అనగానే టక్కున గుర్తుకొచ్చే నటి ఇలియానా. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా… ఆట, పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి సినిమాలల్లో నాజూకు నడుముతో కుర్రకారుకు పిచ్చెక్కించేసింది. దేవదాసు, జల్సా, జులాయి సినిమాల్లో ప్రత్యేకంగా నడుమును వర్ణించే పాటల కోసమే ఇలియానాను హీరోయిన్ గా సెలక్ట్ చేసారా అని అనిపిస్తుంది. తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో… తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఇలియానా… ఇటీవలే తల్లి అయినట్లు ప్రకటించింది. అయితే తన పెళ్ళి గురించి కాని… భర్త గురించి కాని ఎక్కడా రివీల్ చేయకుండా అభిమానులను సస్పెన్స్ లోనికి నెట్టింది.
Ileana d’cruz – ఆగస్టులో బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
తమిళం, హిందీ సినిమాల్లో బిజీగా ఉందని అనుకున్న టాలీవుడ్ ప్రేక్షకులకు నటి ఇలియానా… ఈ ఏడాది ఏప్రిల్ లో షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతినంటూ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా(Ileana d’cruz)… కొన్ని రోజుల తరువాత ఈ విషయాన్ని బయటకు వెల్లడించింది. అయితే భర్త ఎవరు, ఏం చేస్తారు అనే వివరాలు మాత్రం బయటపెట్టలేదు.
ఇన్ స్టా లో ఇలియానాను కార్నర్ చేసిన నెటిజన్… తప్పనిసరి పరిస్థితుల్లో భర్త వివరాలు వెల్లడించిన జీరోసైజ్ బ్యూటీ
ఇటీవల ఇన్ స్టాలో తన ఫాలోవర్లతో ముచ్చటించిన ఇలియానాకు ఓ నెటిజన్…. మీరు సింగిల్ పేరెంటా ? అంటూ షాకింగ్ క్వశ్చన్ వేసాడు. దీనితో నెటిజన్ ప్రశ్నకు స్పందించిన ఇలియానా తన భర్తతో కలిసున్న ఫొటోని స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే ఇలియానా పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం అతడి పేరు మైఖేల్ డోలన్ అని మాత్రమే తెలుస్తోంది. అతడు ఏం చేస్తున్నాడు ? ఇండస్ట్రీతో సంబంధం ఏమైనా ఉందా ? లేదా ? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
Also Read : Big Boss Faima: హాస్పిటల్ లో చేరిన బిగ్ బాస్ బ్యూటీ