Good Bad Ugly : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నటుడు అజిత్ కుమార్ కు బిగ్ షాక్ ఇచ్చారు. తను నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తన పాటలను వాడుకున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తనకు ఛాన్స్ ఇచ్చిన పండితారాధ్యుల బాలసుబ్రమణ్యంపై కూడా మండిపడ్డారు. నోటీసులు పంపించారు. చివరకు పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
Good Bad Ugly Movie Team Got Shock
తాను రూపొందించిన మూడు పాటలను ఉపయోగించారని వాపోయారు ఇళయరాజా. కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ సినిమాలో ఓథా రూప థారెన్, ఇలామై ఇధో ఇధో, ఎన్ జోడి మాంజా కురువి వంటి పాటలు తనవేనంటూ పేర్కొన్నారు. వెంటనే సినిమా నుంచి తన పాటలను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఇళయరాజా డిమాండ్ చేశారు.
ఓథ రూప పాట 1995లో విడుదలైన నట్టుపుర పట్టు చిత్రంలోనిది. ఇలమై ఇధో ఇధో పాట కమల్ హాసన్-రజనీకాంత్ నటించిన సకలకళా వల్లవన్, ఎన్ జోడి మంజ కురువి హాసన్ విక్రమ్ (1986) నుండి వచ్చింది. ప్రస్తుతానికి, గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలు ఇంకా దీనిపై స్పందించలేదు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కుమార్ , త్రిష కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. భారీ ఆదరణ లభించింది. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
Also Read : Hero Ravi Teja-Mass Jathara :మాస్ మహారాజా సాంగ్ మాస్ జాతర