Ilayaraja: ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్‌

ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్‌

Hellotelugu-Ilayaraja

ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్‌

Ilayaraja : మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా తెరకెక్కనుందంటూ గత కొన్ని రోజుల జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ లో ప్రారంభించి 2025లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు?మిగిలిన పాత్రల్లో ఎవరెవరు నటించనున్నారు? అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసుకున్న ఇళయరాజా(Ilayaraja) జీవిత కథ ఆధారంగా సినిమా రానుండటంతో అటు సంగీతాభిమానులతో పాటు ఇటు ఇళయరాజా అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Ilayaraja – కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కాంబోలో పలు భారీ బడ్జెట్ సినిమాలు

ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో గ్లోబల్ గుర్తింపు కలిగిన మెర్కూరీ గ్రూప్…. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కనెక్ట్ మీడియాతో కలిపి రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనితో భాగంగా ధనుష్ ప్రధాన పాత్రలో ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కించనున్నట్లు కనెక్ట్ మీడియా నుంచి వరుణ్ మాథుర్, మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తిశరణ్ లు సంయుక్తంగా ప్రకటించారు. ఇక, ధనుష్ విషయానికి వస్తే… ప్రస్తుతం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ ‘కెప్టెన్ మిల్లర్‌’ విడుదల కానుంది. దీని తరువాత ధనుష్‌ 50 కాకుండా దర్శకులు శేఖర్‌ కమ్ముల, మారీ సెల్వరాజ్‌, అరుణ్‌ మాథేశ్వరన్‌, ఆనంద్‌ ఎల్‌.రాయ్, వెట్రిమారన్‌తో ఆయన సినిమాలు చేయనున్నారు.

మ్యూజిక్‌ మ్యాస్ట్రో గా ఇళయరాజా

ఇళయరాజా అలియాస్ జ్ఞానదేశికన్ జూన్ 2 1943లో తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా పన్నైపురంలో జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడిగా, పాటల రచయిత, గాయకుడిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ముద్ర వేసుకున్నారు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.

Also Read : Pawan Kalyan-Nitin: పవన్‌ కల్యాణ్‌తో నితిన్‌ సినిమా ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com