Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన పాటల హక్కుల విషయం మరోసారి వివాదాస్పదంగా మారింది. తాను సంగీతం అందించిన పాటలకు చెందిన సర్వహక్కులు తనవే అన్నట్లు వ్యవహరిస్తున్న ఇళయరాజా ధోరణిపై మిశ్రమ స్పందన వస్తుంది. గతంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను… తన అనుమతి లేకుండా మ్యూజికల్ నైట్స్ లో వాడుతున్నారంటూ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కూలీ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కు ఇళయరాజా నోటీసులు పంపించడం మరోసారి కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
Ilaiyaraaja:
జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో రజనీకాంత్ తాను 151వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సీన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు ఇంతకు ముందే తెలిపారు. కాగా దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కాగా ఇందులో డిస్కో డిస్కో అనే పాట చోటు చేసుకుంటుందట. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పాటకు ఇంతకు ముందు రజినీకాంత్(Ilaiyaraaja) హీరోగా నటించిన తంగమగన్ చిత్రానికి తాను రూపొందించిన వావా పక్కమ్ వా పాట ట్యూన్ నే మార్చి రూపొందించారని… అందుకు తన అనుమతి తీసుకోలేదని ఇళయరాజా సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు పంపారు. కాగా వేట్టైయాన్ చిత్రం కోసం ముంబాయి వెళ్లిన రజనీకాంత్ శనివారం చెన్నైకు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఇళయరాజా నోటీసుల వ్యవహారం గురించి పాత్రికేయులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా… అది చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజాకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు.
Also Read :-Vijay Deverakonda: రూరల్ యాక్షన్ డ్రామాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా !