Ilaiyaraaja : “1940లో ఒక గ్రామం”, “కమలతో నా ప్రయాణం ” వంటి పలు అవార్డు చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘1920 భీమునిపట్నం’. భారత స్వాతంత్రోద్యమం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కంచర్ల ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా… కంచర్ల అచ్యుతరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
స్వతంత్ర పోరాటంలోని కొన్ని నిజ జీవిత పాత్రలు, కొన్ని ఊహాజనిత పాత్రల్ని ప్రేరణగా తీసుకుని ఓ ప్రేమకథను సిద్ధం చేసారు దర్శకుడు నరసింహ నంది. ఈ కథను దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు(Ilaiyaraaja) వినిపించడంతో… ఆయన సంగీతం అందించడానికి అంగీకరించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
Ilaiyaraaja – ‘1920 భీమునిపట్నం’ స్వాతంత్రోద్యమం నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథ
ఇటీవల మ్యాజిక్ మాస్ట్రో ఇళయరాజాను కలిసిన దర్శకుడు నరసింహ నంది తన తదుపరి చిత్రం ‘1920 భీమునిపట్నం’ విశేషాలను వెల్లడించారు. ‘‘స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే ఓ ప్రేమజంట కథ ఇది. కొన్ని నిజ జీవిత పాత్రలు, కొన్ని ఊహాజనిత పాత్రల్ని ప్రేరణగా తీసుకుని కథని తయారు చేశాం. దానిని ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజాకు వినిపించడంతో ఆయ చాలా మెచ్చుకుని ఈ సినిమాకు సంగీతం అందించడానికి అంగీకరించారు’’ అన్నారు దర్శకుడు నరసింహ నంది.
ఆస్కార్ స్థాయిలో ‘1920 భీమునిపట్నం’
‘‘మన స్వతంత్ర పోరాటంలో మనకు తెలియని కథలు చాలా ఉన్నాయి. అందులో సీతారాం, సుజాత అనే జంట ప్రేమకథని ఆస్కార్ స్థాయికి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నాం. ఇళయరాజాని కలిసి ఈ కథని చెప్పాం. ఇలాంటి కథని ఇప్పటివరకూ వినలేదని ఆయన ఎంతగానో మెచ్చుకుని సంగీతం అందించడానికి అంగీకరించారు. ఆయన సంగీతం మా చిత్రానికి ప్రధానబలం అవుతుంది’’ అన్నారు నిర్మాత కంచర్ల అచ్యుతరావు. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’ లాంటి చిత్రాలు తీసి పలు పురస్కారాల్ని అందుకున్న నరసింహ నంది దర్శకత్వంలో నటిస్తుండడం ఆనందంగాఉంది. నా కెరీర్‌లో ఈ చిత్రం గుర్తుండిపోతుంది’’ అన్నారు సినిమా హీరో కంచర్ల ఉపేంద్ర.
Also Read : Naresh Vijayakrishna: సినీ నటుడు నరేష్ కి అరుదైన గౌరవం