Ilaiyaraaja: ఇళయరాజా కుమార్తె భవతారణి మృతి !

ఇళయరాజా కుమార్తె భవతారణి మృతి !

Hello Telugu - Ilaiyaraaja

ఇళయరాజా కుమార్తె భవతారణి మృతి !

 

ప్రముఖ సంగీత దర్శకులు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె, గాయని, సంగీత దర్శకురాలు భవతారణి రాజా (47) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూసింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌ తో బాధ పడుతున్న భవతారణి… శ్రీలంకలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం ఆమె భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకురానున్నారు. ఆమె భౌతిక కాయం చెన్నై చేరుకున్న వెంటనే అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసారు. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కార్తీక్‌ రాజా, యువన్ శంకర్‌ రాజా సంగీత దర్శకులు. కుమార్తె భవతారణ సంగీత దర్శకురాలిగా, గాయనిగా రాణిస్తున్నారు. అయితే కొంత క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. అడ్వర్టైజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్‌ శబరిరాజ్‌తో భవతారణి వివాహం జరిగింది. అయితే వీరికి సంతానం లేరు.

 

మలయాళ త్రీడీ ‘మై డియర్‌ కుట్టి చాత్తాన్‌’ గాయనిగా భవతారణికి తొలి సినిమా. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ చిత్రం ద్వారా గాయనిగా కోలీవుడ్‌ కి పరిచయమయ్యారు భవతారణి. ‘భారతి’ సినిమాలోని ‘మైలు పోల పొన్ను’ అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలను పాడారు భవతారణి. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో’ పాటతో… మెలోడీ సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిత్ర్‌: మై ఫ్రెండ్‌’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్‌ ఖాన్, అభిషేక్‌ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్‌ మిలేంగే’ సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com