Amar Singh Chamkila : ఐఐఎఫ్ఏ డిజిటల్ అవార్డులు 2025 సంవత్సరానికి ప్రకటించింది. గ్రామీణ నాటక పంచాయత్ , ఇంతియాజ్ అలీ సంగీత బయో పిక్ అమర్ సింగ్ చంకీలా(Amar Singh Chamkila) విజేతగా నిలిచింది. అత్యుత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ అవార్డుల కార్యక్రమం జైపూర్ లో జరిగింది. స్ట్రీమింగ్ కంటెంట్ పరంగా అత్యుత్తమ వాటిని ఎంపిక చేసింది. నటన విభాగాలలో కృతి సనన్ , విక్రాంత్ మాస్సే విజేతలుగా నిలిచారు. నటనా పరంగా స్త్రీ చిత్రంలో కృతీ సనన్ ఎంపిక కాగా, మేల్ పరంగా సెక్టార్ 36 కోసం విక్రాంత్ మాస్సే ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా ఇంతియాజ్ అలీని ఎంపిక చేశారు.
Amar Singh Chamkila got Award
ఉత్తమ సహాయక పాత్రలో స్త్రీ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను అనుప్రియా గోయెంకా ఎంపికైంది. మేల్ విభాగంలో సెక్టార్ 36 చిత్రంలో దీపక్ డోబ్రియాల్ , ఉత్తమ కథ ఒరిజినల్ విభాగంలో దో పట్టి కోసం కనికా థిల్లాన్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ సీరీస్ విభాగంలో పంచాయత్ సీజన్ 3, ప్రధాన పాత్రలో నటించిన బాండిష్ బాండిట్స్ సీజన్ -2 కింద శ్రేయ చౌదరని, జితేంద్ర కుమార్, సీరిస్ లో దర్శకుడి విభాగంలో దీపక్ కుమార్ మిశ్రా ఎంపికయ్యారు.
సహాయక పాత్రలో నటనకు గాను హీరా మండి ది డైమండ్ బజార్ కోసం సంజీదా షేక్, పంచాయత్ సీజన్ 3 కోసం ఫైసల్ మాలిక్, ఉత్తమ కథ ఒరిజనల్ విభాగంలో కోటా ఫ్యాక్టరీ సీజన్ 3, ఉత్తమ రియాలిటీ లేదా ఉత్తమ నాన్-స్క్రిప్టెడ్ సిరీస్ విభాగంలో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్, ఉత్తమ డాక్యు సీరీస్/డాక్యు ఫిల్మ్: యో యో హనీ సింగ్ ఫేమస్ ఎంపికైంది. ఉత్తమ టైటిల్ ట్రాక్ మిస్‌మ్యాచ్డ్ సీజన్ 3 నుండి ఇష్క్ హై కోసం అనురాగ్ సైకియా ఎంపిక చేశారు.
Also Read : Anurag Kashyap Shocking :హిందీ సినీ రంగం విష పూరితం