I MAX: ఏపీ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ ! త్వరలో ఏపీలో ఐ మ్యాక్స్ థియేటర్స్ !

ఏపీ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ ! త్వరలో ఏపీలో ఐ మ్యాక్స్ థియేటర్స్ !

Hello Telugu - I MAX

I MAX: సినిమా ఏదైనా హైదరాబాద్ ప్రసాద్ ఐ మ్యాక్స్ లో చూస్తే ఆ థ్రిల్ వేరు. సినిమా ప్రేమికులు ముఖ్యంగా హాలీవుడ్ సినిమా ప్రేమికులకు ప్రసాద్ ఐ మ్యాక్స్ లో సినిమా చూడాలనుకుంటారు. దీనికి కారణం ప్రసాద్ ఐ మ్యాక్స్ లో బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తే స్కీన్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ ప్రేక్షకుల్ని వేరొక లోకానికి తీసుకెళ్తుంది. అయితే తెలంగాణాతో పోలిస్తే ఏపీ(AP)లో సినిమా ప్రేమికులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ప్రసాద్ ఐ మ్యాక్స్ లాంటి థియేటర్లు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలోని సినీ అభిమానులకు లులూ గ్రూప్ గుడ్ న్యూస్ తెలిపింది. అయితే ఇక నుండి ఏపీలో కూడా ప్రసాద్ ఐ మ్యాక్స్ ను ప్రారంభించబోతున్నట్లు సీఎం చంద్రబాబుతో ఇటీవల భేటీ అయిన లూలూ గ్రూప్ చైర్మెన్ ప్రకటించారు.

I MAX Theaters in AP…

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడంలో భాగంగా తీరప్రాంత నగరమైన విశాఖపట్నంలో 8-స్క్రీన్ మల్టీప్లెక్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో I MAX కోసం వెయిట్ చేస్తున్న సినీ ప్రేమికుల చిరకాల వాంఛ నెరవేరనుంది. గతంలో విశాఖ బీచ్ రోడ్ లో లూలూ మాల్ పెట్టడానికి ఒప్పందాలు చేసుకన్నప్పటికీ… ప్రభుత్వం మారడంతో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విధానాలతో లులూ గ్రూప్‌ ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు సుముఖత చూపెట్టలేదు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన లులూ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ యూసఫ్ ఆలీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రస్తుతం వైజాగ్‌లో ప్రీమియం షాపింగ్ మాల్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే తిరుపతి, విజయవాడలలో హైపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు.

సినీ హీరోలను ఫ్యామిలీ, దేవుళ్లతో పోల్చే సంస్కృతి ఉన్న ఏపీలో ఈ నిర్ణయంతో సినిమాభిమానులు హర్షం వ్యక్తం చేస్తునారు. ఇన్ని రోజులు ఇలాంటి థియేటర్లు లేక అవతార్, బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయామని ఇప్పుడు ఆ లోటు తీరనుందని సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్ని అనుమతులు కల్పిస్తామని తెలుపుతూ లులూని ఆంధ్రప్రదేశ్‌ కు ఆహ్వానించారు. లులూ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ యూసఫ్ ఆలీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంను గుర్తు చేసుకుంటూ.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Megha Akash: రాహుల్ గాంధీని కలిసిన నితిన్ బ్యూటీ మేఘా ఆకాష్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com