Varalakshmi Sarathkumar : వరలక్ష్మిశరత్‌ కుమార్‌ కి మర్చిపోలేని కానుక ఇచ్చిన సచ్‌ దేవ్‌ !

వరలక్ష్మిశరత్‌ కుమార్‌ కి మర్చిపోలేని కానుక ఇచ్చిన సచ్‌ దేవ్‌ !

Hello Telugu - Varalakshmi Sarathkumar

Varalakshmi Sarathkumar: దక్షిణాది భాషల లేడీ విలన్, ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన 14 ఏళ్ళ తన స్నేహ, ప్రేమ బంధానికి ముగింపు పలికి తన ప్రియుడు, ముంబైకు చెందిన గ్యాలరిస్ట్ నికోలై సచ్‌ దేవ్‌తో కలిసి ఏడడుగులు నడిచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. తన కుమార్తె రిసెప్షన్ ను చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించిన రాధిక శరత్ కుమార్ దంపతులు… పెళ్లి మాత్రం సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో థాయ్ లాండ్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ప్రస్తుతం వీరి రిసెప్షన్, వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Varalakshmi Sarathkumar….

అయితే తన భార్య వరలక్ష్మి శరత్ కుమార్ కు… ఆమెకు తన భర్త నికోలై సచ్‌ దేవ్‌ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారట. అదేమిటంటే.. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయికి ఇంటిపేరు మారుతుంది. ‘నా భార్య కూడా అలాగే తన పేరు మార్చుకోవాలనుకుంది. అయితే అందుకు భిన్నంగా నా పేరును వరలక్ష్మి శరత్‌కుమార్‌(Varalakshmi Sarathkumar) ని యాడ్‌ చేసుకొని నేనే ‘నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్‌ సచ్‌దేవ్‌ ’ గా మార్చుకుంటున్నాను. రేపు నా పిల్లలకు కూడా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అనే పేరు వారసత్వంగా వస్తుంది. ఆమెకు నేనిచ్చే గుర్తుండిపోయే కానుక ఇదే. నా భార్య మంచి నటి మాత్రమే కాదు, మంచి వ్యక్తి కూడా. రోజు తన నుంచి ఓ కొత్త విషయం నేర్చుకుంటా. త్వరలోనే తమిళం కూడా నేర్చుకుంటా. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తుంది’ అన్నారు సచ్‌దేవ్‌. అలాగే వరలక్ష్మి మాట్లాడుతూ..‘పెళ్లి తర్వాత నటిస్తావా? అని నన్ను చాలా మంది అడిగారు. దానికి నా భర్తే సమాధానం చెప్పారు. నటిస్తుంది అని. ‘నికోలై నా ప్రేమ అయితే.. సినిమా నా జీవితం’ అని చెప్పుకొచ్చారు.

కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లో అడుగుపెట్టిన వరలక్ష్మి(Varalakshmi Sarathkumar)… తమిళనాట చాలా మంది హీరోలతో కలిసి నటించింది. అయితే పెద్దగా కలిసి రాలేదు. దీనితో విలన్ తరహా పాత్రలు ప్రారంభించడంతో ఒక్కసారిగా సక్సెస్ అయింది. టాలీవుడ్ లో ప్రముఖ లేడీ విలన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ లో నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్… గతంలో హీరో విశాల్‌ తో ప్రేమాయణం నడిపిందని… తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత కోలీవుడ్ హీరోలు ధనుష్ లేదా శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని 38 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది.

Also Read : Balakrishna: రాజస్థాన్‌ లో బాలకృష్ణ యాక్షన్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com