ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు వచ్చాక సీన్ మారింది. నిన్నటి దాకా సినీ రంగమే డామినేట్ చేసేది. ఎప్పుడైతే టెక్నాలజీలో మార్పులు చేసుకున్నాయో క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తూ దర్శకులు తమ ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, ఆహా, తదితర ఓటీటీలలో ఆలోచింప చేసే వెబ్ సీరీస్ తో పాటు సినిమాలు కూడా , డ్రామాలు ఆకట్టుకుంటున్నాయి. ఆలోచింప చేస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా నెట్ ఫ్లిక్స్ లో
స్ట్రీమింగ్ అవుతోంది థాయ్ డ్రామా చలన చిత్రం హంగర్.
దీనికి సిటిసిరి మొంగ్ కోల్ సిరి దర్శకత్వం వహించారు. కొంగ్ డేజ్ జతురాన్రసమీ రచించారు. ఇందులో చుటిమోన్ చుయెంగ్చారోన్ సుకియింగ్ అయోమ్ చెఫ్ పాత్రలో నటించాడు. నోపచై జయనామా పోషించాడు ఈ పాత్రను. గన్ స్వస్తి టోన్ సపోర్టివ్ సాస్ చెఫ్ గా నటించి మెప్పించారు.
ఈ చిత్రం 2022లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ చూరగొంది. ఏకంగా 87 శాతం రేటింగ్ ను పొందింది. సినిమాలో కొన్ని లోపాలు ఉండవచ్చు గాక..డ్రామా, ఆలోచింప చేసే మాటలు కూడా ఉన్నాయని సమీక్షలు చెబుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో రెడీగా ఉంది..వీలైతే చూసి తరలించాల్సిన మూవీ హంగర్.