Hunger : కొందరు డబ్బు కోసం సినిమాలు తీస్తారు. కొందరు అవార్డుల కోసం సినిమాలు తీస్తారు. కొందరు ప్యాషన్‌తో సినిమాలు తీస్తారు. సినిమాలను ఇష్టపడి, ప్యాషన్‌తో తీసిన వారికి అవార్డులు, రివార్డులు వస్తాయి. న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన గోపాల బోడేపల్లి తన ప్యాషనేట్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాడు. గోపాల్ బోడేపల్లి నిర్మించి, దర్శకత్వం వహించిన ‘హంగర్’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. ఇది అంతర్జాతీయ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గౌరవప్రదమైన ప్రస్తావన పొందింది. ఈ చిత్రం పారిస్ మరియు లండన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌తో పాటు 10 ఇతర అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో కూడా అవార్డులను గెలుచుకుంది.
Hunger Movie Awards
గోపాల్ దర్శకత్వం వహించిన మునుపటి చిత్రం మరణం కూడా 34 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులను గెలుచుకుంది. ఇదిలా ఉంటే రెండు సినిమాలు దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికయ్యాయి.
Also Read : Ram Charan RC16 : గ్లోబల్ స్టార్ ఆర్ సి 16 లో కన్నడ స్టార్