Hrithik Roshan : 1000 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన అభిమానిని కలిసిన హృతిక్

ఈ విషయం తెలుసుకున్న హృతిక్‌ తాజాగా అతడిని కలిశారు. కారులో ప్రయాణిస్తోన్న ఆయన....

Hello Telugu - Hrithik Roshan

Hrithik Roshan : బాలీవుడ్‌ నటుడు హృతిక్‌రోషన్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు ఓ వ్యక్తి. కొన్నిరోజుల నిరీక్షణకు ఫుల్‌స్టాఫ్‌ పడింది. ఎట్టకేలకు అభిమాన హీరోతో ఫొటో దిగాడు. ఆ ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. విషయంలోకి య వెళ్తే.. హరియాణాలోని ఫరియాబాద్‌కు చెందిన జాదు అనే వ్యక్తికి హృతిక్‌(Hrithik Roshan) అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని తెలియజేసేలా తరచూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుండేవాడు. ఈ క్రమంలోనే హృతిక్‌ను కలవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామం నుంచి ముంబైకి సైకిల్‌పై ప్రయాణం మొదలుపెట్టాడు. దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన అతడు హీరోని కలవడం కోసం ఆయన ఇంటి ముందు నాలుగు రోజులుగా వేచిచూశాడు.

Hrithik Roshan Met

ఈ విషయం తెలుసుకున్న హృతిక్‌ తాజాగా అతడిని కలిశారు. కారులో ప్రయాణిస్తోన్న ఆయన.. ఇంటి బయట ఎదురుచూస్తోన్న అభిమానిని దగ్గరకు పిలిచి కాసేపు మాట్లాడి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. హృతిక్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘కోయిమిల్‌గయా’లో ఏలియన్‌ లుక్‌ను తాను రీ క్రియేట్‌ చేశానని ఆ అభిమాని తెలిపాడు. ఇక హృతిక్‌ సినిమాల విషయానికొస్తే.. ‘ఫైటర్‌’తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు నటుడు హృతిక్‌ రోషన్‌. ఆయన ‘వార్‌ 2’ కోసం వర్క్‌ చేస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read : Lucky Bhaskar : ‘లక్కీ భాస్కర్’ సినిమాకు ఇంత స్పందన వస్తుందని ఉహించనేలేదు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com