Venom The Last Dance : ప్రపంచ సినీ ప్రేక్షకులను, హాలీవుడ్ సినిమా లవర్స్‌ను అలరించేందుకు చాలా రొజుల తర్వాత మరో మంచి ఇంగ్లీష్ చిత్రం వీనమ్ ది లాస్ట్ డాన్స్(Venom The Last Dance) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే చాలా మంది అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తుండగా ఇప్పటికే రిలిజ్ చేసిన ట్రైలర్లు సినిమాపై అంచనాలను ఆకాశన్నంటేలా చేశాయి.
Venom The Last Dance Movie Updates
అయితే ఈ సినిమాపై భారతీయ సినీ ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ను మన దేశంలో దాదాపు 1500కుపైగా స్క్రీన్లలో ప్రదర్శించడం విశేషం. కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించగా టామ్ హార్డీ హీరోగా నటించగా చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్ , రైస్ ఇఫాన్స్ కీలక పాత్రల్లో నటించారు. ‘వెనమ్’ సిరీస్‌లో భాగంగా మూడోభాగంగా తెరకెక్కిన ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్(Venom The Last Dance)’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న రిలీజ్ కానుంది. మన దేశంలో మాత్రం ఒకరోజు ముందుగానే (ఆక్టోబర్24) గురువారం రోజున విడుదల అవుతుండడం విశేషం. ఔటర్ స్పేస్ నుంచి భూమిపైకి వస్తున్న సింబియోట్ అనే గ్రహాంతరవాసులలో వెనమ్ ఒకరు. స్పైడర్ మ్యాన్ కామిక్స్‌లో అత్యంత పాపులర్ విలన్లలో ఒకరైన ‘వెనమ్’ పాత్ర ఆధారంగా రూపొందిన రూపొందించిన ఈ చిత్రం మొదటి భాగం 2018లో విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ చిత్రం రెండో భాగాన్ని ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ అనే పేరుతో తెరకెక్కించగా 2021లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మూడోది, చివరి భాగమైన ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ మరో రెండు రోజుల్లో (ఆక్టోబర్ 25) విడుదల కానుంది. దానికంటే ముందుగానే ప్రేక్షకులను అబ్బురపరిచేందుకు ఇప్పటికే మూడు ట్రైలర్లను రిలీజ్ చేశారు. ఇందులో యాక్షన్, అడ్వెంచర్ సన్నివేశాలు మొదటి రెండు భాగాలను మించేలా ఉన్నాయి. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు చాలా భాషల్లో ఈ సినిమాను అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Sunainaa : నాకు ఎవరిపైనా ప్రేమ లేదు..నేను సినిమానే ప్రేమిస్తున్నాను