The Fall Guy : యాక్షన్ లవర్స్‌ను అలరించేందుకు ఈ మధ్య ఓ హాలీవుడ్ చిత్రం ది ఫాల్ గయ్(The Fall Guy) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 181 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ర్యాన్ గోస్లింగ్ , ఎమిలీ బ్లంట్ , ఆరోన్ టేలర్ జాన్సన్ , హన్నా వాడింగ్‌హామ్ వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటించగా డెడ్పూల్, బుల్లెట్ ట్రైన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన డేవిడ్ లిచ్ ఈ మూవికి దర్శకత్వం చేశారు. అయితే స్వతాహాగా ఫైట్ మాస్టర్ కూడా అయిన దర్శకుడు ఆ నేపథ్యాన్ని ఈ సినిమా కథగా వాడుకోవడం గమనార్హం.
The Fall Guy Movie OTT Updates
కథ విషయానికి వస్తే.. కోర్ట్ ఓ స్టంట్‌మెన్. టామ్ రైడర్ అనే యాక్షన్ హీరోకు డూప్‌గా స్టంట్స్ చేస్తుంటాడు. అయితే ఓ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడి చాలాకాలం ఇంటికే పరిమితం అవుతాడు. ఈ క్రమంలో తన ప్రేయసి (అసిస్టెంట్ డైరెక్టర్)కి దూరమవుతాడు. అయితే ఓ రోజు గాలి మేయర్ అనే మహిళా నిర్మాత నేను నిర్మిస్తోన్న ఓ సినిమాకు పని చేయాలని, దానికి నీ మాజీ ప్రేయసి మొదటిసారి దర్శకత్వం వహిస్తోందని చెప్పడంతో కోర్ట్ ఆ సినిమాకు పని చేయడానికి ఒప్పుకోని షూటింగ్ జరుగుతున్న ఆస్ట్రేలియాకు వెళతాడు. అక్కడకు వెళ్లాక కోర్ట్ తన ప్రేయసిని మచ్చిక చేసుకుంటాడు.
అయితే సినిమాలో హీరోగా చేస్తున్న టామ్ కనబడడం లేదు అతన్ని కనిపెట్టాలంటూ నిర్మాత స్టంట్‌మాన్ కోర్ట్‌ను కోరుతుంది. ఆ క్రమంలో కోర్ట్ హీరో టామ్‌ను కనిపెట్టే క్రమంలో కొన్ని చిక్కులో పడతాడు. కోర్ట్ను చంగానికి ఓ గ్యాంగ్ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో కోర్ట్ టామ్‌ను కనిపెట్టగలిగాడా,అసలు టామ్‌కు ఏమైంది, కోర్టును ఎందుకు చంపాలనుకున్నారు, సినిమా షూటింగ్ చేయగలిగారా లేదా అనే ఆసక్తికరమైన కథనంతో సినిమా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఎక్కడా బోర్ అనే మాట తెలియకుండా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో, ట్విస్టులతో, అదిరిపోయే యాక్షన్ సీన్లతో సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడీ ది ఫాల్ గయ్(The Fall Guy) సినిమా జియో సినిమా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యాక్షన్, కామెడీ మూవీ చూడాలనుకునే వారు ఈ సినిమాను తప్పకుండా చూసేయండి. ఒకటి రెండు చోట్ల ముద్దు సన్నివేశాలు తప్పితే సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
Also Read : BSS12 Movie : హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సమీరా పాత్రకు సంయుక్త